డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘భగవంతుడు’

- November 23, 2026 , by Maagulf
డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘భగవంతుడు’

హైదరాబాద్: యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంతుడు’ డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు జి.జి. విహారి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ చిత్రంలో కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మాత రవి కుమార్ పనస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విద్యా శ్రీ పనస సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ‘భగవంతుడు’ సినిమా షూటింగ్‌తో పాటు ప్యాచ్‌వర్క్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాత రవి పనస ఉన్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దర్శకుడు జి.జి. విహారి ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

హీరో తిరువీర్ కెరీర్‌లో ‘భగవంతుడు’ ఓ ప్రతిష్టాత్మక చిత్రంగా నిలవనుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మూవీ లవర్స్‌లో ఆసక్తి పెరుగుతోంది.

డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్న ‘భగవంతుడు’ విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

నటీనటులు: తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషి, వినయ్ వర్మ, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ, అధిరే అభి, బలగం సంజయ్, హర్షిణి, రవీందర్ రెడ్డి, మైమ్ మధు తదితరులు.

సాంకేతిక బృందం:

ఆడియో: మధుర

కాస్ట్యూమ్ డిజైనర్: ఆయేషా మరియం

యాక్షన్: రామ్ కిషన్, రాబిన్ సుబ్బు

పాటల రచయితలు: చంద్రబోస్, డా. గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, జి.జి. విహారి

కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట

సంగీతం: కె.పి.

ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

లైన్ ప్రొడ్యూసర్: గౌతమ్ ఊడుగుల

పీఆర్ఓ: సురేష్ (ఎస్‌కే మీడియా)

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి.జి. విహారి

బ్యానర్: రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)

నిర్మాత: రవి కుమార్ పనస

సహ నిర్మాత: విద్యా శ్రీ పనస

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com