అజ్మాన్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు

- November 25, 2026 , by Maagulf
అజ్మాన్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు

అజ్మాన్: యూఏఈ 55వ జాతీయ దినోత్సవం (ఈద్ అల్ ఎతిహాద్) సందర్భంగా అజ్మాన్ ఎమిరేట్‌లోని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

అజ్మాన్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 డిసెంబర్ 2, బుధవారం నుంచి డిసెంబర్ 4, శుక్రవారం వరకు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటాయి. అనంతరం డిసెంబర్ 7, సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ పని వేళలు తిరిగి ప్రారంభమవుతాయి.

ఈ సందర్భంగా యూఏఈ నాయకత్వానికి, ప్రభుత్వానికి, పౌరులకు, నివాసితులకు మానవ వనరుల శాఖ శుభాకాంక్షలు తెలిపింది. దేశం నిరంతరం శాంతి, సౌభాగ్యం, అభివృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ప్రార్థించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com