సౌదీలో ముగ్గురికి మరణశిక్ష...
- August 01, 2015
సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ముగ్గురి తలలను తెగనరికారు. సౌదీ అరేబియాలో ఆ దేశానికి చెందిన అల్-దియాని, షిరో అల్-జినోబి, మన్సూర్ అల్ రోలీ అనే ముగ్గురి తలలను నరికి మరణిక్షను అమలుచేశారు. ఈ శిక్షను ముగ్గురికీ వేరు వేరు ప్రాంతాలలో అమలు చేశారు. వీరిలో దియాని, జినోబిలు హత్య కేసులో అరెస్టు చేయబడినవారు కాగా, మన్సూర్ మత్తు పదార్థాలను స్మగ్లింగ్ చేసినందుకు అరెస్టు అయ్యాడు. ముగ్గురితో కలిపి ఈ ఏడాది సౌదీలో మరణ శిక్షకు గురైన వారి సంఖ్య 107కు చేరింది. ఈ విధంగా తలలు తెగనరికి మరణశిక్షలను విధించడంపై పలు వర్గాల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత మే నెలలో తలలు తెగనరికేందుకు పనివారు కావలెను అంటూ సౌదీ ప్రభుత్వం ప్రకటన చేయడం విశేషం.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







