ఒలింపిక్‌ స్టార్లను ఘనంగా సత్కరించిన దిల్లీ ప్రభుత్వం

- August 31, 2016 , by Maagulf
ఒలింపిక్‌ స్టార్లను ఘనంగా సత్కరించిన దిల్లీ ప్రభుత్వం

రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు, వారిని తీర్చిదిద్దిన కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులను దిల్లీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. దిల్లీ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రజత పతక విజేత పీవీ సింధు, రెజ్లింగ్‌లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌, వారి కోచ్‌లు గోపీచంద్‌, మన్‌దీప్‌లను దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఘనంగా సత్కరించారు. ఒలింపిక్‌ విజేతలకు అనుక్షణం తోడుగా ఉండి పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో తోడ్పడిన ఫిజియోథెరపిస్టులను సైతం ఈ కార్యక్రమంలో సత్కరించారు. గతంలో ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతులను ఈ సందర్భంగా సింధు, సాక్షి మలిక్‌లకు కేజ్రీవాల్‌ అందజేశారు.

అనంతరం సింధు, మలిక్‌ మాట్లాడుతూ.. దిల్లీ ప్రభుత్వం ప్రోత్సాహం, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో రాబోయే రోజుల్లో దేశానికి మరిన్ని పతకాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com