బ్రెడ్‌ కట్‌లెట్‌

- August 01, 2015 , by Maagulf
బ్రెడ్‌ కట్‌లెట్‌

బ్రెడ్‌ కట్‌లెట్‌
కావాల్సిన పదార్ధాలు
బ్రెడ్‌ స్లైసెస్‌ - నాలుగు
బంగాళా దుంపలు - ఒకటి
పచ్చి బఠాణీలు - రెండు కప్పులు
క్యాబెజ్‌ తురుము - ఒక కప్పు
క్యారెట్‌ తురుము - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
అల్లం తురుము - అరటీస్పూను
గరం మసాలా - ఒక టీ స్పూను
నిమ్మరసం - ఒక టీ స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - తగినంత
బ్రెడ్‌ పొడి - ఐదు టేబుల్‌ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా ఒక నాన్‌ స్టిక్‌ పాన్‌లో నూనె వేసి ఉల్లి పాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి మిగిలిన కూరగాయల ముక్కలు కూడా వేయించి, బఠానీలు, గరం మసాలా వేసి కొంచెం సేపు ఉడికినాక స్టవ్‌ ఆఫ్‌ చేసి పక్కన పెట్టాలి. బంగాళా దుంపలను ఉడికించి, చెక్కు తీసి చిదిమేసి దానిలో ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కలిపి పైన వేయించి పెట్టుకున్న కూరగాయల మిశ్రమంలో కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరచేతిలో పెట్టుకుని టిక్కీల్లా చేసుకుని వాటిని బ్రెడ్‌ పొడిలో దొర్లించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసెల పాన్‌ మీద నూనె వేసుకొని వీటిని ఒక్కొక్కటి నూనె వేస్తూ రెండు వైపులా దోరగా వేయించాలి.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com