పాలకూరతో జ్ఞాపక శక్తి లభిస్తుంది.
- August 01, 2015
ఆకుకూరల్లో పాలకూర రారాజులాంటిది అని చెప్పవచ్చు. ఈ పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ పిల్లల్లో ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు పాలకూరపై తాజాగా చేసిన అధ్యయనాల ఫలితంగా కొన్ని విషయాలు ఋజువయ్యాయి. పాలకూరలోని ఫోలిక్ ఆమ్లం మెదడులోని కండరాలను ఉత్తేజపరుస్తూ జ్ఞాపకశక్తి మెండుగా పెరగడానికి దోహదపడ్తుంది. పాలకూరను ప్రతీరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల తగినంత ఫోలిక్ ఆమ్లం శరీరానికి అంది వయసుతో పాటు వచ్చే మతిమరుపు దూరమవుతుంది. వయసు పెరిగే కొలదీ మన మెదడులోని హిప్పో క్యాంపస్ పనితీరు మొద్దుబారుతూ వస్తుంది. అలా జరక్కుండా ఉండడానికి శరీరానికి ఫోలిక్ ఆమ్లం ఎంతగానో దోహదపడ్తుంది. అందుకే ప్రతిరోజూ తాజా పాలకూర మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రోజువారీ మన శరీరానికి అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్లో 15 శాతం అదనంగా అందుతుంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







