"సౌందర్యలహరీ"

- September 02, 2016 , by Maagulf

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

శక్తిం గూడియె యీశ్వరుండు సృజియించం జాలు లోకంబులన్
శక్తిం బాసిన కాలు,కేలు కదుపన్ సాధ్యంబె యెవ్వానికిన్
శక్తిం గొల్తురు బ్రహ్మ,విష్ణు,హరులున్ సర్వార్థసంసిద్ధికై
శక్తిన్ సన్నుతిసేయుపుణ్యమెడగా సంప్రజ్ఞులెట్లౌదురో?.......... .......1
        
నీపదరేణువుం బడసి నీరజగర్భుడు సృష్టికర్తయౌ,
నీపదరేణువుం దలలనిల్పును వేయిట విష్ణువాదటన్,
నీపదరేణువున్మెదిపి నేరుపునన్ హరుడంగరాగసం
దీపనసిద్ధినొందు జననీ! నిను వర్ణనసేయనేర్తునే?............. .2
 
పాపనవిద్య సూర్యఖని, పాపదరిద్రత దేవరత్నమౌ,
బాపజడత్వమున్ పరమభవ్యసచేతన పుష్పసారమౌ,
పాపిభవాబ్ధి మింటనిలుపంగను విష్ణువరాహదంష్ట్రయౌ,
నీ పదపాంసుజాలమది నిక్కమెరింగి వచింపనేర్చినన్!!!.........త్రీ

దేవతలెల్ల హస్తముల దీప్తివహింపగ భద్రముద్రలన్,
నీవుభవత్కరంబులను నిల్పవుముద్రలు నందుకైదగన్,
దేవి! భవత్పదంబులవి నేర్చెనుగా నభయప్రదంబులై,
శ్రీవిలసిల్లి ముఖ్యవరసిద్ధి యొనర్పగ మించి వాంఛలన్!!!..........4
 
హరి శ్రీచక్రసురూపధారిణిని  నిన్నర్చించి స్త్రీరూపియై
పరమాత్మున్ హరునంతవాని మునుముంపంజాలె మోహాంబుధిన్
స్మరుడౌరా! రతికంటికాటుకగుచున్  సన్మౌని హృన్మండలిన్
పరివేధించి విమోహవార్ధిమునుచున్ భవ్యాత్మ! నీసత్కృపన్!!!............5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com