'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే' ప్లాటినమ్ డిస్క్ వేడుక

- September 02, 2016 , by Maagulf
'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే' ప్లాటినమ్ డిస్క్ వేడుక

పి.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై సోనీ పవన్, గట్టు రజని నిర్మించిన చిత్రం 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'. సంతోష్ నేలంటి దర్శకుడు. గట్టు మను, పవన్, సోనియా దీప్తి ముఖ్య తారలు. ర్యాప్‌రాక్ షకిల్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభి స్తోందని నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు.

దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ- ''ఇది ఫీల్ గుడ్ మూవీ. యూత్‌కి కావల్సిన మసాలా ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కావల్సినవి ఉన్నాయి'' అన్నారు. ''ఈ చిత్రం ద్వారా మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయటం చాలా ఆనందంగా ఉంది'' అని నిర్మాత అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com