పవన్‌కల్యాణ్‌ రాకతో నాకు పునర్జన్మ - శ్రీజ

- September 02, 2016 , by Maagulf
పవన్‌కల్యాణ్‌ రాకతో నాకు పునర్జన్మ - శ్రీజ

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ తనకు పునర్జన్మ ప్రసాదించారని ఆయన వీరాభిమాని శ్రీజ చెప్పింది. గతంలో తీవ్ర అనారోగ్యంతో మృత్యువుకు చేరువైన శ్రీజను ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పవన్‌కల్యాణ్‌ పరామర్శించిన విషయం తెలిసిందే.
అనారోగ్యం నుంచి కోలుకున్న శ్రీజ శుక్రవారం ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకల్లో పాలు పంచుకుంది.

మెగాఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పురావూరి సుమంత్‌ ముఖ్యఅతిథిగా పవన్‌కల్యాణ్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీజ మాట్లాడింది. పవన్‌కల్యాణ్‌ రాకతోనే తనకు పునర్జన్మ సిద్ధించిందని చెప్పింది. పవన్‌కల్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పింది. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పింది. శ్రీజ పాల్వంచలో తొమ్మిదోతరగతి చదువుతుతోంది.
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఖమ్మంలోని కార్తీక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శ్రీజను 2014 అక్టోబర్‌లో పరామర్శించారు. శ్రీజను చూసిన పవన్ కంటతడి పెట్టారు. పవన్ కళ్లు చెమర్చాయి. అక్కడున్నంత సేపు ఆయన ఆవేదనగా కనిపించారు. శ్రీజ పరిస్థితిను చూసి చలించిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com