అల్ షాయిబా స్పాంజ్ గొడౌన్లో అగ్ని ప్రమాదం
- September 03, 2016
300 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉన్న స్పాంజ్ గొడౌన్లో చెలరేగిన మంటల కారణంగా భారీ ఆస్థి నష్టం సంభవించింది. కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ (కెఎఫ్ఎస్డి)కి సమాచారం అందించిన వెంటనే, హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని, మంతల్ని ఆర్పేందుకు ఫైర్ ఫైటర్స్ కృషి చేశారు. కేవలం మూడే నిమిషాల్లో ప్రమాద స్థలికి చేరుకోవడంతో మంటల్ని అదుపు చేయడానికి వీలు కలిగింది. అయితే మండే స్వభావం ఉన్నవి ఎక్కువగా ఉండటంతో మంటలు అదుపు చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మంటల్ని ఇతర ప్రాంతాలకి విస్తరించకుండా అదుపు చేయడంలో ఫైర్మెన్ చేసిన కృషి ఫలించింది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ షేక్ మొహమ్మద్ అల్ అబ్దుల్లా అల్ ముబారక్ అల్ సబా ప్రమాద స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. పలువురు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద కారణాలపై ఆరా తీశారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







