కేరళలో మద్యం, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారకర్తగా సచిన్
- September 03, 2016
మద్యం, మాదక ద్రవ్యాల కట్టడికి కేరళ ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కేరళ ప్రభుత్వం తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. మద్యం, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారకర్తగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ రాష్ట్ర ఎక్సైజ్, లేబర్ మినిస్టర్ రామకృష్ణన్ వెల్లడించారు. మీడియా సమేవేశంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం, డ్రగ్స్‌లకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని వెల్లడించారు. క్రమంగా మద్యానికి బానిసలుగా మారిన వారి సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
మద్యం మత్తు నుంచి బయటపడే పలు సెంటర్లను ప్రతి జిల్లాస్థాయిలో తెరవనున్నట్టు కూడా మంత్రి రామకృష్ణన్ తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







