డబ్బింగ్‌ పూర్తి చేసుకున్న 'ఈ చరిత్ర ఇంకెనాళ్లు'

- September 03, 2016 , by Maagulf
డబ్బింగ్‌ పూర్తి చేసుకున్న 'ఈ చరిత్ర ఇంకెనాళ్లు'

తమిళంలో విజయం సాధించిన 'తరకప్పు' చిత్రాన్ని తెలుగులో 'ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు' పేరుతో విడుదల చేస్తున్నారు. వీజేవైస్‌ఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై వై. శేషిరెడ్డి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శక్తివేల్‌ వాసు, సముద్రఖణి, వైశాలి, రియాజ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రవి దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా వై. శేషిరెడ్డి మాట్లాడుతూ.. 'తమిళంలో ఘన విజయం సాధించిన 'తరకప్పు' చిత్రాన్ని తెలుగులో 'ఈ చరిత్ర ఇంకెనాళ్లు' పేరుతో అనువదిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్ర హీరోలు సముద్రఖని, శక్తివేల్‌ పోటాపోటీగా నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ఉత్కంఠ భరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ కథని దర్శకుడు రవి అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే రెండు ప్రేమ జంటల చిలిపి విన్యాసాలు యువతను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబరు రెండోవారంలో ఆడియోని విడుదల చేసి అక్టోబరులో సినిమాని విడుదల చేయనున్నాము' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com