బ్రిటన్ కొత్త ప్రధానిని కలిసిన మోడీ

- September 05, 2016 , by Maagulf
బ్రిటన్ కొత్త ప్రధానిని కలిసిన మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రిటన్‌ నూతన ప్రధాని థెరిస్సా మేతో భేటీ అయ్యారు. బ్రెగ్జిట్‌ అనంతరం బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రితో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ మీడియా ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మోదీ చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న జీ20 సదస్సుకు హాజరయ్యారు.
యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగాక బ్రిటన్‌ ప్రధాని పదవి నుంచి డేవిడ్‌ కామెరూన్‌ తప్పుకున్నారు.

దీంతో జులై 13న థెరిసా నూతన ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్‌కు మార్గరెట్‌ తర్వాత రెండో మహిళా ప్రధానమంత్రిగా థెరిస్సా నియమితులైన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com