బ్రిటన్ కొత్త ప్రధానిని కలిసిన మోడీ
- September 05, 2016
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రిటన్ నూతన ప్రధాని థెరిస్సా మేతో భేటీ అయ్యారు. బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్ కొత్త ప్రధానమంత్రితో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ మీడియా ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మోదీ చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న జీ20 సదస్సుకు హాజరయ్యారు.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగాక బ్రిటన్ ప్రధాని పదవి నుంచి డేవిడ్ కామెరూన్ తప్పుకున్నారు.
దీంతో జులై 13న థెరిసా నూతన ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్కు మార్గరెట్ తర్వాత రెండో మహిళా ప్రధానమంత్రిగా థెరిస్సా నియమితులైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..







