విజయ్ దర్శకత్వంలో సాయేషా సైగల్
- September 05, 2016
'అఖిల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సాయేషా సైగల్ తమిళ చిత్ర పరిశ్రమలోకి తేరంగేట్రం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో సాయేషా కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభించినట్లు జయం రవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా ఎగ్జైటింగ్గా ఉందని సాయేషా ట్వీట్ చేశారు. దీంతోపాటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జయం రవితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. హరీశ్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సరసన సాయేషా నటించిన 'శివాయ్' చిత్రం అక్టోబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







