తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ ప్రముఖులు

- September 05, 2016 , by Maagulf

వినాయకచవితి పండుగను పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు తమ ఇంట వేడుకలను షేర్ చేశారు. తొలిసారి పండుగ జరుపుకున్నట్లు హీరోయిన్ చార్మీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. స్వతహాగా పంజాబీ అయినా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిలైపోవడంతో తెలుగు సంప్రదాయాలను కూడా చార్మీ పాటిస్తోంది.

చిరంజీవి, రాంచరణ్ తదితరులు తమ ఇంట్లోనే గణపతి పూజ చేసుకుని.. ఆ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ పూజలో దర్శకుడు వీవీ వినాయక్ కూడా పాల్గొన్నారు.
షూటింగ్ కారణంగా ఇంటికి దూరంగా ఉన్న వరుణ్ తేజ్ ఇంట్లో పండుగ సందడిని షేర్ చేశారు. కాజల్ అగర్వాల్, మంచు మనోజ్, కళ్యాణ్ రామ్, మంచు విష్ణు, దేవీ శ్రీ ప్రసాద్, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా భాటియా, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని, అల్లు శిరీష్ లు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com