తాజ్ మహల్ సమీపంలో విమానాశ్రయం
- September 05, 2016
ప్రేమమందిరానికి ప్రతీకగా నిలిచిన తాజ్‌మహల్ అందాలను వీక్షించేందుకు ఇప్పటి వరకు రోడ్డు.. రైలు మార్గాలనే పర్యాటకులు ఆశ్రయించారు. ఇక నుంచి విమాన సదుపాయాన్ని కల్పించనున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజ్‌మహల్ సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఇందుకోసం ప్రభుత్వం 150 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రూ.100కోట్ల వ్యయంతో రన్‌వేను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే రన్‌వేకు సంబంధించిన పనులు ప్రారంభించనున్నారు. .
వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు ప్రారంభిస్తామని. దీనికి సంబంధించిన స్థలాన్ని ముందే పర్యవేక్షించామని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దీపక్ సింఘాల్ వెల్లడించారు. పర్యాటకులు దిల్లీకి వచ్చి అక్కడి నుంచి రోడ్డు.. రైలు మార్గాల ద్వారా ఆగ్రా చేరుకుంటున్నారని పర్యాటకశాఖ పేర్కొంది. తాజ్ అందాలను వీక్షించేందుకు భారత్ నుంచి 65లక్షల మంది పర్యాటకులు వస్తుండగా. ఏడు లక్షల మంది విదేశీయులు వస్తుంటారు. కాని ఆగ్రాలో తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట, ఫతేఫూర్ సిక్రీ ఉన్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







