రూ. 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా 'జనతా గ్యారేజ్' రికార్డు ...
- September 06, 2016
జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జనతా గ్యారేజ్'. ప్రకృతి ప్రేమికుడిగా సరికొత్త పాత్రలో తారక్ విభిన్నంగా కనిపించిన ఈ సినిమా.. రికార్డులను బద్దలుకొడుతూ ముందుకుసాగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా..' నాలుగురోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్‌ను దాటింది. తద్వారా టాలీవుడ్‌లో 'బాహుబలి' తర్వాత అత్యంత వేగంగా రూ. 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా 'జనతా గ్యారేజ్' రికార్డు సృష్టించింది.సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. ఎన్టీఆర్, మోహన్‌లాల్ వంటి భారీ తారాగణం ఉండటం 'జనతా గ్యారేజ్'కు ప్లస్ అయింది. ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్ చూపిన అభినయానికి ప్రశంసలు దక్కుతున్నాయి.ఈ సినిమాకు రివ్యూలు ఎలా వచ్చినా తొలిరోజు వసూళ్లు మాత్రం దుమ్మురేపాయి. ఏకంగా తొలిరోజు రూ. 21 కోట్లు కొల్లగొట్టిన 'జనతా గ్యారేజ్'.. నాలుగో రోజైన ఆదివారం రూ. 5 కోట్లు మాత్రమే సాధించినట్టు తెలుస్తోంది. అమెరికాలో ఈ సినిమా దాదాపు రూ. 9.31 కోట్ల (1.4 మిలియన్ డాలర్ల) వసూళ్లు రాబట్టింది. డివైడ్ టాక్ వచ్చినా పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్', మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' తొలి వీకెండ్‌లో మంచి వసూళ్లు రాబట్టాయి. 'సర్దార్ గబ్బర్‌సింగ్' రూ. 40 కోట్లు, 'బ్రహ్మోత్సవం' రూ. 30 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఈ రెండు సినిమాలను అధిగమించి భారీస్థాయిలో తారక్ సినిమా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. అమెరికాలో మిలియన్ డాలర్ మార్క్ కలెక్షన్లను సాధించిన ఎన్టీఆర్ నాలుగో సినిమా ఇది. ఇంతకుమునుపు నాన్నకు ప్రేమతో, టెంపర్, బాద్షా సినిమాలు అగ్రరాజ్యంలో మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లు సాధించాయి. టాక్ ఎలా ఉన్నా 'జనతా గ్యారేజ్' వసూళ్లు స్థిరంగా ఉండటంతో మున్ముందు కలెక్షన్లపరంగా మరిన్ని రికార్డులు ఈ సినిమా సృష్టించవచ్చునని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







