'ఇంద్రాణి ట్రస్ట్-కువైట్' ఆధ్వర్యంలో ఘనంగా గణపతి ఉత్సవాలు

- September 06, 2016 , by Maagulf

ఏ దేశమేగినా ఎందు కాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లుగా భారత సాంప్రదాయాన్ని నలువైపుల చాటి చెప్పే ఘనత సాదించిన ఈ కువైట్ ఎనారైస్ అత్యంత భక్తి శ్రద్ధలతో, ఈ సంవత్సరం చేజెర్ల ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఖైతాన్ లోని శ్రీకృష్ణ కమిటీ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. అధ్యక్షులు శ్రీ చేజెర్ల ఇంద్రకుమార్ రాజు గారి అన్నదానం ప్రక్రియతో, గణేష్ ఉత్సవాలు పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా చేసారు. అత్యంత భారిగా మరింత హంగు ఆర్భాటాలతో చక్కటి కార్యక్రమాలతో అలరించాడు ఈ కువైట్ ఏనారై వినాయకుడు.

భారతదేశంలోనే కాదు కువైట్ లో భారత సాంప్రదాయాల విలువలని చాటి చెప్తూ.. భారతీయ పద్ధతులకి ఏమాత్రం లోటు రానివ్వకుండా , కువైట్ వారిని నొప్పంచకుండా ఘనంగా వేడుకలు చేసుకుని, సాయంత్రం 7 గంటలకి కువైట్ పుర వీధుల్లో ఊరేగింపు తో సహా నిమజ్జన మహోత్సవం జరిగింది

ఈసారి లడ్డు వేలం పాటలో చేజెర్ల ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ చేజెర్ల ఇంద్ర కుమార్ రాజు KD 550-160 n కి సొంతం చేసుకుని పుణ్యం చేసుకున్నారు.

 

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com