పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు..
- September 07, 2016
మరికొద్దిగంటల్లో రియో డిజనీరోలోని మారకానా స్టేడియంలో పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. వికలాంగులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న రియో 2016 పారా ఒలింపిక్స్ పోటీలను ఈ సారి ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 154 దేశాల్లో ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ వెల్లడించింది. టీవీ, రేడియో, ఆన్లైన్ ద్వారా పోటీలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని కమిటీ సిబ్బంది తెలిపారు.2012 లండన్ పారాలింపిక్ గేమ్స్‌ను 115దేశాల్లో ప్రసారం చేయగా ఈసారి 30శాతంపైగా పెంచినట్లు తెలిపారు. 2012లో 3.8బిలియన్ల మంది ఈ ప్రసారాలను వీక్షించగా..ఈ సారి వారి సంఖ్య 4బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. పారాలింపిక్స్ ఈ నెల 7 నుంచి 18 వరకు జరగనున్నాయి. మన దేశం తరఫున 15మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







