యుఎఇ సందర్శన వీసా కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్త

- September 07, 2016 , by Maagulf
యుఎఇ సందర్శన వీసా కోసం  ఆన్లైన్ లో  దరఖాస్తు చేసే సమయంలో జాగ్రత్త

మనామా: బహ్రేయినీ నివాసితులు తగినంత జాగ్రత్తగా లేకుంటే  ఆన్ లైన్ లో యుఎఇ సందర్శన వీసా కోసం సుమారు మూడురెట్లు సొమ్ము చెల్లించే ప్రమాదం ఏర్పడేవచ్చు.యుఎఇ సందర్శించాలంటే  ఒక స్వల్పకాలిక పర్యటన వీసా  24 బి డి  మాత్రమే  ఖర్చవుతుంది, కానీ  కొన్ని వెబ్సైట్లను ఇందుకు  70 బి డి లకు ఆ వీసా ను అందిస్తున్నాయి.  ఈ విషయం తెలియని కొందరు ఆన్ లైన్ వినియోగదారులు, గూగుల్  ద్వారా ఖరీదైన ఎంపిక చేసుకొని నష్టపోతున్నారు. యుఎఇ ప్రభుత్వ  అధికారిక  వెబ్సైట్ ద్వారా యుఎఇ ఇ-వీసా కోసం నివాసితులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, గూగుల్ లో శోధించడం ద్వారా అధికారిక వెబ్సైట్ కనుగొనడంలో అంత సులభం కాదు. ఎందుకంటే   గూగుల్  శోధన ఫలితాల్లో అధికమొత్తంలో అసంఖ్యాక ఇతర వెబ్సైట్లు ఉన్నాయి ఇటీవల,ఒక మనామా నివాసి  యుఎఇ సందర్శన వీసా కోసం 70 బి డి  చెల్లించాడు.నేను కంప్యూటర్ లో   పై స్థానంలో ఉన్న  శోధన ఫలితంపై క్లిక్ చేశాను. నేను అధికారిక వెబ్సైట్ ఉపయోగించి ఉంటె  దరఖాస్తు ప్రక్రియ లో తక్కువ చెల్లించి ఉండేవాడిని. నేను తప్పు స్థానంలో దరఖాస్తు మరియు డబ్బు చెల్లించాను. ఇతరులు నా అనుభవం నుంచి పాఠం  నేర్చుకోవాలని ఆయన అన్నారు. సరైన వెబ్సైటు కోసం  యుఎఇ రాయబార కార్యాలయం ను  సంప్రదించగా ఒక ప్రతినిధి ఇ-వీసా పొందడానికి వారి అధికారిక వెబ్సైట్లు www.government.ae మరియు www.ednrd.ae అని వెల్లడించినట్లు తెలిపారు. మీరు ఆ వెబ్సైట్లలో ఒక ఖాతా ద్వారా సుమారు  24 బి డి లను చెల్లించి అవసరమైన దశలను పూర్తి చేయవచ్చు. అంతకన్నా వీసా ఖర్చు ఏమీ ఉండదని  ఆ ప్రతినిధి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com