'సాయే దైవం' చిత్రం పాటల విడుదల
- September 07, 2016
విజయచందర్ సాయిబాబాగా నటించిన తాజా చిత్రం 'సాయే దైవం'. జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ, పొనుగోటి భవాని అర్జున్‌రావుతో కలిసి నిర్మించారు. ఘటికాచలం సంగీతం అందించిన ఈ చిత్రం పాటల సీడీని విజయచందర్ విడుదల చేశారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండలి చైర్మన్లు చక్రపాణి, స్వామిగౌడ్, జస్టిస్ చంద్రయ్య హాజరయ్యారు. ''బాబా భక్తుల అనుభవాల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నాం'' అని దర్శక-నిర్మాతలు అన్నారు. ''30 ఏళ్ల క్రితం 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం'లో సాయిబాబా పాత్ర చేశా. మళ్లీ ఆ పాత్ర చేసే చాన్స్ రావడం నా అదృష్టం'' అని విజయచందర్ అన్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







