మనసు లో మాట చెప్పిన ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామరెడ్డి

- August 04, 2015 , by Maagulf
మనసు లో మాట చెప్పిన ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామరెడ్డి

ఇప్పటి వరకు తాను 93 సినిమాలకు దర్శకత్వం వహించగా వాటిలో 27 మెగాస్టార్ చిరంజీవి న టించినవేనని, తన వం దో సినిమా కూడా ఆయనతోనే చేయాలని ఉందని ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామరెడ్డి అ న్నారు. కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వంలో కోదండ రామరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా నటించిన 'పాండవుల్లో ఒకడు' సినిమా యూనిట్ సో మవారం అనుశ్రీ సారుుకృష్ణా థియేటర్లో సందడి చేసింది. తం డ్రీ తనయులు మ్యాట్నీషో విరామంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోదండరామరెడ్డి మాట్లాడుతూ చిరంజీవితో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ఆనందంగా ఉందన్నారు. 93 సినిమాలు చేసిన తాను మిగతా ఏడూ పూర్తిచేసి, శతచిత్రదర్శకుడిని అనిపించుకుంటానన్నారు. చిరంజీవి అంగీకారం కోసం ప్రయత్నిస్తానన్నారు. వైభవ్‌కు ఎక్కువగా తమిళ సినిమారంగంనుం చి ఆఫర్లు వస్తున్నాయన్నారు. పరిశ్రమలో ప్రతివారూ తమ పిల్లలు స్థి రపడేలా చేయూలనుకుంటున్నప్పుడు తన కొడుకు పైకి రావాలని తా ను ప్రయత్నించడం తప్పు కాదన్నారు. వైభవ్ మాట్లాడుతూ సి నిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో మరిన్ని మంచి సినిమాల్లో నటిస్తానన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com