ప్రీ క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారుడు తో తలపడనున్నా పంకజ్‌

- September 08, 2016 , by Maagulf
ప్రీ క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారుడు తో తలపడనున్నా పంకజ్‌

15సార్లు ప్రపంచ స్నూకర్‌ ఛాంపియన్‌ అయిన భారత క్రీడాకారుడు పంకజ్‌ అద్వాణీ సాంగ్‌సమ్‌ 6 రెడ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రీ క్వార్టర్స్‌కి దూసుకెళ్లాడు. గ్రూప్‌ దశలో వరుసగా డోమినిక్‌ డేల్‌(యూకే), రాబర్ట్‌ మికిన్స్‌(ఇంగ్లండ్‌), రైన్‌ తోమర్‌సన్‌(ఆస్ట్రేలియా), పైటూన్‌ పోన్‌బన్‌(థాయ్‌లాండ్‌) క్రీడాకారులపై విజయం సాధించాడు. ఒకానొక దశలో జర్మనీకి చెందిన క్రీడాకారుడు లూకస్‌ క్లికర్స్‌పై 6-0 తేడాతో విజయం సాధించాడు. ఈ టోర్నీలో చైనా క్రీడాకారుల నుంచి పలువురికి గట్టి పోటీ ఎదురవుతోంది. అద్వాణీ ప్రీ క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారుడు యూన్‌ సిజున్‌తో తలపడనున్నాడు.ఈ సందర్భంగా అద్వాణీ మాట్లాడుతూ.. ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com