గల్ఫ్‌ ఎయిర్‌కి ప్రతిష్టాత్మక అవార్డ్‌

- September 08, 2016 , by Maagulf
గల్ఫ్‌ ఎయిర్‌కి ప్రతిష్టాత్మక అవార్డ్‌

మనామా: గల్ఫ్‌ ఎయిర్‌ తాజాగా బెస్ట్‌ ఐటీ సెక్యూరిటీ ప్రాజెక్ట్‌ అవార్డ్‌ని సొంతం చేసుకుంది. సెక్యూరిటీ ఎడ్వైజర్‌ మిడిల్‌ ఈస్ట్‌ ఈవెంట్‌లో ఈ అవార్డ్‌ దక్కింది. సిపిఐ మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో దుబాయ్‌లోని అల్‌ హబతూర్‌ గ్రాండ్‌ హోటల్‌లో ఈ వెంట్‌ జరిగింది. సెక్యూరిటీ డెసిషన్‌ మేకర్స్‌, ఐటీ ప్రొఫెషనల్స్‌ మిడిల్‌ ఈస్ట్‌ కంపెనీల నుంచి పలువురు ప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ అవార్డ్‌ గల్ఫ్‌ ఎయిర్‌కి ఏడవది. ఎయిర్‌లైన్స్‌ సంస్థ తరఫున గల్ఫ్‌ ఎయిర్‌ డైరెక్టర్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ జసిమ్‌ హాజి ఈ అవార్డ్‌ని అందుకున్నారు. 2015లో గల్ఫ్‌ ఎయిర్‌ ప్రపంచంలోనే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ పొందిన తొలి ఎయిర్‌లైన్‌ సంస్థగా అవతరించింది. క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌, సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో చూపిన ప్రత్యేకత నేపథ్యంలో ఈ గౌరవం దక్కించుకుంది గల్ఫ్‌ ఎయిర్‌. అలాగే గల్ఫ్‌ ఎయిర్‌లైన్‌, కంప్యూటర్‌ న్యూజ్‌ మీడియా ఈస్ట్‌ సిఐఓ 100 అవార్డ్స్‌ని నాలుగోసారి వరుసగా అందుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com