కంపెనీలపై 85 శాతం ఫిర్యాదులకు పరిష్కారం
- September 08, 2016
దోహా: కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (సిఆర్ఎ), ఓరెడూ, వోడాఫోన్ ఖతార్లకు వ్యతిరేకంగా వచ్చిన 877 ఫిర్యాదుల్లో 85 శాతం ఫిర్యాదుల్ని పరిష్కరించింది. మిగతా సమస్యలకు పరిష్కారం విషయంలో ఆయా కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సిఆర్ఎ కన్స్యూమర్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కోసం సంబంధిత కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చనీ, ఒకవేళ 30 రోజుల తర్వాత కూడా పరిష్కారం దొరకకపోతే '103' అనే సిఆర్ఎ హాట్‌లైన్‌కి ఫిర్యాదు చేయవచ్చని సిఆర్ఎ కన్స్యూమర్స్ ఎఫైర్స్ షడిపార్ట్మెంట్ మేనేజర్ అమీల్ సలీమ్ అల్ హనావి చెప్పారు. ఇ-మెయిల్ ద్వారా కూడా వినియోగదారులు సర్వీస్ ప్రొవైడర్లపై పిర్యాదు చేయవచ్చని ఆమె తెలిపారు. నెట్ వర్క్ సమస్యలు, డివైజ్ ఇన్స్టలేషన్లో ఆలస్యం లాంటి సమస్యలు ఎక్కువగా వినియోగదారుల నుంచి సర్వీస్ ప్రొవైడర్లపై వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







