బాహుబలి-2 చిత్రం రైట్స్‌ను కొన్న నాగ్..

- September 08, 2016 , by Maagulf
బాహుబలి-2 చిత్రం రైట్స్‌ను కొన్న నాగ్..

దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి-1 ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు బాహుబలి-2 కూడా అంతకన్నా ఎక్కువ అంచనాల నడుమ రిలీజ్ అవుతుండడంతో చిత్ర బిజినెస్ కూడా ఆ రేంజ్‌లోనే సాగుతుంది. తెలుగులో స్టార్ హీరో, బిజినెస్‌మెన్ అక్కినేని నాగార్జున ఈ చిత్రం రైట్స్‌ను కొన్నట్లు సమాచారం. కృష్ణ జిల్లా హక్కులను వారాహి చలన చిత్రం అధినితే సాయి కొర్రపాటితో కలిసి నాగార్జున 8 కోట్ల భారీ మొత్తానికి కొన్నారని అంటున్నారు. బాహుబలి-1 రైట్స్ కూడా తీసుకుందామని ప్రయత్నించిన నాగ్ అప్పుడు వెనక్కి తగ్గారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com