ఆఫ్గాన్ పేలుళ్ళను ఖండించిన బహ్రెయిన్
- September 08, 2016
మనామా: ఆఫ్గనిస్తాన్‌లోని కాబూల్‌లో ఇటీవల సంభవించిన బాంబు పేలుళ్ళను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. తీవ్రవాదులు బాంబు పేలుళ్ళతో కాబూల్‌పై విరుచుకుపడ్డ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బహ్రెయిన్ తీవ్రంగా స్పందించింది. ఆప్ఘనిస్తాన్‌కి తమ నుంచి నైతిక మద్దతు ఎప్పుడూ వుంటుందని ఈ సందర్భంగా బహ్రెయిన్, సందేశం పంపింది ఆఫ్ఘనిస్తాన్‌కి. తీవ్రవాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు అంతర్జాతీయ సమాజం అంతా ఒక్కతాటిపైకి రావాలని, అంతర్జాతీయ వేదికలపై తామూ తీవ్రవాదాన్ని ఖండిస్తూనే ఉన్నామని బహ్రెయిన్ పేర్కొంది. తీవ్రవాదం మానవాళికి పెను శాపంగా మారిందని బహ్రెయిన్ నాయకత్వం అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







