ఘోర రోడ్డు ప్రమాదం : ఒడిశా లో

- September 09, 2016 , by Maagulf
ఘోర రోడ్డు ప్రమాదం  : ఒడిశా లో

ఒడిశా రాష్ట్రంలోని అంగూల్‌ జిల్లా, అథమల్లిక్‌ ప్రాంతంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్‌ బస్సు బ్రిడ్జి పై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 16 మంది ఘటనా స్థలంలో చనిపోగా మరో 9 మంది ఆస్పత్రిలో కన్నుమూశారు. మృతుల్లో మహిళలు, విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వేగంగా వెళుతున్న బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com