ఘోర రోడ్డు ప్రమాదం : ఒడిశా లో
- September 09, 2016
ఒడిశా రాష్ట్రంలోని అంగూల్ జిల్లా, అథమల్లిక్ ప్రాంతంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బ్రిడ్జి పై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 16 మంది ఘటనా స్థలంలో చనిపోగా మరో 9 మంది ఆస్పత్రిలో కన్నుమూశారు. మృతుల్లో మహిళలు, విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వేగంగా వెళుతున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్







