స్పాన్సర్ షిప్‌ని రద్దు చేయండి: మారియా గ్రాజియా
- September 09, 2016
కువైట్: యూఎన్ ప్రతినిథి మారియా గ్రాజియా జియామ్మారినరో, కువైట్‌లో కఫలా సిస్టమ్ (స్పాన్సర్ షిప్ సిస్టమ్)ని రద్దు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ విధానంతో హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్య తీవ్రతరమవుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఖలాఫా సిస్టమ్ విషయంలో కువైట్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఆమె ప్రశంసించారు. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఈ విధానం ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని అభిప్రాయపడ్డారామె. ఖఫాలా సిస్టమ్‌కి బదులుగా మరో కొత్త విధానాన్ని ఇంకా సమర్థవతంగా అమల్లోకి తీసుకొస్తే మంచిదని ఆమె చెప్పారు. హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో కువైట్ తీసుకుంటున్న చర్యల్ని యూఎన్ తరఫున అభినందిస్తున్నట్లు వెల్లడించిన మారియా, స్పార్సర్ షిప్ సిస్టమ్ ద్వారా మహిళలు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారనీ, చాలా సందర్భాల్లో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







