150 పాత టైర్ల స్వాధీనం: హౌబారా వేటగాడి అరెస్ట్
- September 09, 2016
కువైట్: సిద్దీక్‌లో ఎమర్జన్సీ టీమ్ జరిపిన ఆకస్మిక దాడుల్లో పెద్ద సంఖ్యలో వాడేసిన టైర్లు, కొత్తగా మార్చి అమ్ముతుండడాన్ని గుర్తించారు. సుమారు 150 వాడేసిన టైర్లను ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు. ఓ గొడౌన్‌లో అక్రమంగా పాత టైర్లను కొత్తగా మార్చుతున్నట్లు అందించిన సమాచారంతో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ దాడులకు సమాయత్తమైంది. ఇంకో వైపున, ఎన్విరాన్‌మెంట్ పోలీసులు, ఓ వీడియో క్లిప్ ఆధారంగా హౌబారా వేటగాడ్ని అరెస్ట్ చేశారు. హౌబారాని వేటాడటం నేరం. ఈ కేసులో దోషిగా తేలితే ఏడాది జైలు శిక్షతోపాటు 500 నుంచి 5000 కువైట్ దినార్స్ వరకూ జరీమానా విధిస్తారు. నిందితుడ్ని సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







