ఒమన్‌లో జీతాలందక వలస కార్మికుల ఆందోళన
- September 09, 2016
డజన్ల సంఖ్యలో ఆగ్రహావేశాలతో ఉన్న కార్మికులు ఒమన్‌లో ఆందోళన చేపట్టారు. వారు పనిచేస్తున్న కంపెనీ, జీతాల్ని నిలిపివేయడం, అలాగే ఎంప్లాయ్‌మెంట్ వీసాల్ని పునరుద్ధరించకపోవడంతో తాము ఆందోళన చేపట్టినట్లు వలస కార్మికులు తెలిపారు. మస్కట్‌లోని ఓ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో 80 మంది వరకు కార్మికులు, ఉద్యోగం కోల్పోయి, జీతం అందక, సరైన ఆహారం, వైద్య సహాయం లేకుండా గత నాలుగు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిలో కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేయగా, ఆ రాజీనామాల్ని ఆ కంపెనీ ఆమోదించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వారి వీసా కూడా ఎక్స్‌పైర్ కావడంతో ఎటూ వెళ్ళలేని పరిస్థితి. అందుకే వారంతా అక్రమంగా ఒమన్‌లో నివసిస్టున్నట్లయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకూ కేవలం మూడు నుంచి నాలుగు నెలల జీతం మాత్రమే వారిలో కొంతమంది అందుకున్నారు. మిగతావారి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. కంపెనీ వర్గాలు వాటిని ఎప్పుడు క్లియర్ చేస్తుందో తెలియని పరిస్థితి. అయితే ఒమన్‌లోని ట్రేడ్ యూనియన్ లీడర్స్, కంపెనీలు ఇలా కార్మికుల్ని రోడ్డున పడేయడం తగదని చెబుతున్నారు. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా ఉండటంతోనే తాము ఏమీ చేయలేకపోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







