మహమ్మద్ బిన్ రషీద్ ఆదేశాల ప్రకారం 488 మంది ఖైదీలు విడుదల

- September 09, 2016 , by Maagulf
మహమ్మద్ బిన్ రషీద్ ఆదేశాల ప్రకారం 488 మంది ఖైదీలు విడుదల

ఈద్ అల్ అధా సందర్భంగా 488 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ఎమిరేట్ లో వివిధ సంస్కారణాత్మక  మరియు శిక్షాత్మక సంస్థల్లో కాలం గడుపుతున్న 488 మంది  ఖైదీలను దుబాయ్ పాలకుడు, యు ఏ ఇ  వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి  మరియు దుబాయ్ పాలకుడు, అతని యువరాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం తన విస్తృత అధికారాలతో విడుదలకు ఆదేశించారు. 

దుబాయ్  అటార్నీ జనరల్ ఇస్సామ్  ఈసా  అల్ హుమైదాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ  పబ్లిక్ ప్రాసిక్యూషన్  వెంటనే దుబాయ్ పోలీస్ సహకారంతో, షేక్ మహ్మద్ ఆజ్ఞని అమలు చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభమైనట్లు చెప్పారు. షేక్ మహ్మద్ చూపిన ఔదార్యం వలన ఈ పండుగ వేళ ఖైదీల కుటుంబాలలో ఎనలేని  ఆనందం తీసుకునివస్తుందని ఆశించారు. విడుదల కాబడిన  ఖైదీలను తిరిగి తమ కుటుంబాలని కలుసుకొని ఇకపై  సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. సమాజంలో మంచి సభ్యులుగా  ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి ఈ విడుదల దోహదపడి వారు ఒక మంచి  నూతన లక్ష్యంతో జీవించాలని అల్ హుమైదాన్ సూచించారు. ఈ విడుదల కేవలం షేక్ మహ్మద్ తన ఉన్నత  చొరవ కారణంగా ఇది సాధ్యపడినట్లు అటార్నీ జనరల్ తెలిపాడు మరియు మతసంబంధ మరియు నైతిక విలువలకు కట్టుబడి వారి జీవితాలను ప్రశాంతంగా  కొనసాగించాలని ఆయన  ఖైదీలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com