దుబాయ్ లో 'గణనాధుడు'

- September 09, 2016 , by Maagulf

భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన గణేష్ నవరాత్రోత్సవాలను గత మూడు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న దుబాయ్ సివిల్ ఇంజనీరింగ్ (DIP) తెలుగు ఫ్రెండ్స్ యూత్.
 నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం హారతి, పూజ కార్యక్రమాలు, రాత్రి 11 గంటలవరకు భజన కార్యక్రమాలు, ప్రతి ఏట తొమ్మిది రోజుల్లో ఒకరోజు అన్నదానం చేస్తారు.  వివిధ రాష్ట్రాలకు చెందిన  సుమారు 3000 మంది భక్తులు  అన్నదానంలో పాల్గొంటారు. 
ప్రతి పండుగ (కృష్ణాష్టమి, ఓనం, శివరాత్రి, దీపావళి ,వినాయకచవితి, రమదాన్, విజయదశమి, గురు పరబ్) మొదలైన పండుగలను ఒక్కో రాష్ట్రం వారు నిర్వహిస్తారు, అందరూ కలిసి ప్రతి పండుగకు ఒకరికి ఒకరు సహకరించడం విశేషం.వినాయక చవితిని తెలుగు ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం.తొమ్మిది రోజులు నంద దీపం నిత్యం వెలుగుతూ ఉండేలా మరియు క్యాంప్ పరిసర ప్రాంతమంతా విద్యుత్ దీపాల అలంకారణ వచ్చే భక్తులను భక్తి పారవశ్యంలో ముంచేసాయి.ఈ కార్యక్రమములో తెలుగు వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


ఈ కార్యక్రమము లో తెలుగు ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు పోశెట్టి, ETCA అధ్యక్షులు కిరణ్ కుమార్,మా గల్ఫ్ అధినేత &TV5-గల్ఫ్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ , ETCA సభ్యులు అరవింద్ బాబు, రాజేష్ బాబు, నరేష్ ఊట్నూరి, వినోద్ కుమార్, నరేష్ యాదవ్, రవి రాజ, రాజు సట్ల తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com