ఫిదా రెండో షెడ్యూల్‌ అమెరికాలో..

- September 09, 2016 , by Maagulf
ఫిదా రెండో షెడ్యూల్‌ అమెరికాలో..

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'ఫిదా' . సాయిపల్లవి కథానాయిక. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కాగా కొద్దిరోజులుగా నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడలో జరుగుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని యూనిట్‌ తిరిగి హైదరాబాద్‌ చేరుకుంది. ఇందులో భాగంగా ప్రధాన పాత్రలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.ఈ విషయాన్ని వరుణ్‌ ట్వీట్‌ చేయడంతో పాటు కథానాయిక సాయిపల్లవి, శేఖర్‌ కమ్ములతో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని పోస్ట్‌ చేశారు. త్వరలోనే ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ మొదలు కానున్నట్లు, దానిని కథాపరంగా అమెరికాలో చిత్రీకరిస్తారని, అందుకు అనుగుణంగానే చిత్రబృందం అమెరికా ప్రయాణానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. అమెరికా అబ్బాయికి..తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథతో ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com