పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 10...
- September 09, 2016
పారాలింపిక్స్‌లో భారత్ రెండు పతకాలు కైవసం చేసుకుంది. రియో పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో భారత అథ్లెట్లు స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హైజంప్ టీ-42 విభాగంలో మరియప్పన్ తంగవేలు 1.89 మీటర్లు హైజంప్ చేసి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, మరో భారత అథ్లెట్ వరుణ్ సింగ్ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం నెగ్గాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రీవె రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు.పారాలింపిక్స్ లో హైజంప్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్ మరియప్పన్. కాగా, వ్యక్తిగత స్వర్ణం నెగ్గిన మూడో భారత అథ్లెట్ గా నిలిచాడు. గతంలో స్విమ్మింగ్, జావెలిన్ త్రో విభాగాలలో భారత్ వ్యక్తిగత స్వర్ణాలు కైవసం చేసుకుంది.
పారాలింపిక్స్ లో ఓవరాల్ గా భారత్ పతకాల సంఖ్య 10కి చేరింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







