బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 10 మంది మృతి
- September 09, 2016
బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గజిపూర్‌లోని తోంగి ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరగడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని బాయిలర్ ప్లాంట్‌లో పేలుడు సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులకు ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. టెంపకో ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున ఈ పేలుడు సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది స్పష్టంచేశారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లి మంటలను అదుపుచేసినట్లు చెప్పారు.పలువురు కార్మికులకు తీవ్ర గాయాలవ్వడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







