మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టనున్న శరత్‌కుమార్‌..

- September 09, 2016 , by Maagulf
మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టనున్న శరత్‌కుమార్‌..

 ఇకనుంచి నటనపై అధికంగా దృష్టి పెట్టనున్నట్లు శరత్‌కుమార్‌ పేర్కొన్నారు. కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజీని సొంతం చేసుకున్నారాయన. సమత్వ మక్కల్‌ కట్చిని స్థాపించి రాజకీయ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో తిరుచెందూర్‌ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ... ''ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ నటుడిగా వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నా. వాటిలో మంచి పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నా. జీవితంలో గెలుపోటములు సహజమే. మనిషి జీవితం సైకిల్‌ పెడల్‌ వంటిది.ఒకటి పైకి వచ్చేటప్పుడు.. మరొకటి కింద ఉంటుంది. కానీ నేను సైకిల్‌ నడపడమే ఆపేశాను. అది సరికాదని ప్రస్తుతం అర్థమైంది.అందుకే నటుడిగా కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం జీవీ ప్రకాశ్‌ నటిస్తున్న 'అడంగాదే'లో ముఖ్యపాత్ర పోషిస్తున్నా. షణ్ముగం ముత్తుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌తో కలిసి 'రాజకుమారా'లో నటిస్తున్నా.ఈ చిత్రం త్వరలోనే తెరపైకి రానుంది. మరో రెండు కథలు విన్నా. ఇకపై వరుసగా చిత్రాలు చేసేందుకు ప్రయత్నిస్తాన''ని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com