మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టనున్న శరత్‌కుమార్..
- September 09, 2016
ఇకనుంచి నటనపై అధికంగా దృష్టి పెట్టనున్నట్లు శరత్‌కుమార్ పేర్కొన్నారు. కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజీని సొంతం చేసుకున్నారాయన. సమత్వ మక్కల్ కట్చిని స్థాపించి రాజకీయ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో తిరుచెందూర్ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ... ''ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ నటుడిగా వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నా. వాటిలో మంచి పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నా. జీవితంలో గెలుపోటములు సహజమే. మనిషి జీవితం సైకిల్ పెడల్ వంటిది.ఒకటి పైకి వచ్చేటప్పుడు.. మరొకటి కింద ఉంటుంది. కానీ నేను సైకిల్ నడపడమే ఆపేశాను. అది సరికాదని ప్రస్తుతం అర్థమైంది.అందుకే నటుడిగా కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం జీవీ ప్రకాశ్ నటిస్తున్న 'అడంగాదే'లో ముఖ్యపాత్ర పోషిస్తున్నా. షణ్ముగం ముత్తుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి 'రాజకుమారా'లో నటిస్తున్నా.ఈ చిత్రం త్వరలోనే తెరపైకి రానుంది. మరో రెండు కథలు విన్నా. ఇకపై వరుసగా చిత్రాలు చేసేందుకు ప్రయత్నిస్తాన''ని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







