హజ్‌లో 2 మిలియన్ల మంది యాత్రీకులు

- September 09, 2016 , by Maagulf
హజ్‌లో 2 మిలియన్ల మంది యాత్రీకులు

మక్కా: గత ఏడాది హజ్‌ యాత్ర సందర్భంగా జరిగిన ప్రమాదంలో 2,300 మంది హజ్‌ యాత్రీకులు మృత్యువాత పడినా, ఈ ఏడాది ఎలాంటి భయాందోళులు లేకుండా ఇప్పటికే 2 మిలియన్ల మంద్రి హజ్‌ యాత్ర కోసం సౌదీకి వస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో సౌదీకి హజ్‌ యాత్రీకులు చేరుకున్నారు. గత ఏడాది ప్రమాద ఘటన అనంతరం, ఇంకా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను నిర్వాహకులు చేయడం జరిగింది. సౌదీకి వ్యతిరేకంగా ఇరాన్‌ హజ్‌ యాత్రీకుల్ని ఉద్దేశించి హజ్‌ యాత్రకు వెళ్ళవద్దని ప్రచారం చేసినప్పటికీ, హజ్‌కి వచ్చే యాత్రీకుల సంఖ్య ఏమాత్రం తగ్గదనీ, ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 'నాకెలాంటి భయం లేదు. అన్నిటికీ అల్లా ఉన్నాడు' అని బ్రిటిష్‌ హజ్‌ యాత్రీకుడు అదిల్‌ అబ్దుల్‌ రహమాన్‌ చెప్పారు. అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై ఆయన పూర్తి సంతృప్తిని తెలియజేశారు. నైజీరాయిక చెందిన లాన్‌ నాజిర్‌ అనే వ్యక్తి గత ఏడాది జరిగిన తొక్కిసలాటలో తన తమ్ముడ్ని కోల్పోయినప్పటికీ హజ్‌ పవిత్రతను గుర్తించి తాను యధాతథంగా ఈ ఏడాది కూడా యాత్రకు వచ్చినట్లు వివరించారు. ఏడు రోజుల హజ్‌ యాత్రలో తొలి రోజు పెద్ద సంఖ్యలో హజ్‌ ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. 43 డిగ్రీల వేడిమిలోనూ హజ్‌ యాత్రీకుల సందడి తగ్గలేదు. హెలికాప్టర్‌లో పర్యవేక్షిస్తూ భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com