ఢిల్లీలో స్వల్ప భూకంపం
- September 10, 2016
ఉత్తర భారతదేశంలో మరోసారి భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో దేశరాజధాని ఢిల్లీ, గురుగ్రామ్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో భూమి పలుమార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదయినట్లు భారత్ వాతావరణ శాఖ( ఐఎండీ) తెలిపింది.
హర్యానాలోని జగ్గర్ కేంద్రంగా భూగర్భం లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు చెప్పింది. దాదాపు 30 సెకండ్ల పాటు ఢిల్లీలో భూమి కంపించినట్లు రాజధానివాసులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఢిల్లీ, ఎన్సీఆర్ రీజియన్లలో మూడు వారాల క్రితం 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నేపాల్ లో గత ఏడాది సంభవించిన భారీ భూకంపం తర్వాత నుంచి ఉత్తరాదిలో పలుమార్లు భూమి కంపిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







