ఇజం మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఓ గెస్ట్ పాత్ర..
- September 11, 2016
ఇటీవల జనతా గ్యారేజ్‌తో హ్యట్రిక్ విజయం అందుకున్న ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రంపై ఫోకస్ చేస్తున్నాడు. దర్శకుడు ఎవరనే దానిపై పూర్తి క్లారిటీ లేకపోయిన త్వరలో 27వ సినిమాను ప్రారంభించాలని యంగ్ టైగర్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్‌కి సంబంధించి ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇజం మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఓ గెస్ట్ పాత్ర పోషించనున్నట్టు సమాచారం. సినిమాలో కథకు అనుగుణంగా ఓ గెస్ట్ పాత్ర ఉండగా ఆ రోల్‌లో ఎన్టీఆర్ అయితే బాగుంటుందని యూనిట్ డిసైడ్ అయిందట. కళ్యాణ్ రామ్‌తో ఎన్టీఆర్‌కి ఉన్న సాన్నిహిత్యం వలన జూనియర్ కూడా ఓకే అన్నారని చెబుతున్నారు.ఇటీవల విడుదలైన ఇజం టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడనే విషయం నిజమే అయితే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ భావిస్తోండగా ఇజంలో జగపతి బాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







