తమిళ్ లో మహెష్ సొంత డబ్బింగ్
- September 11, 2016
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయక పాత్రలో అలరించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో వార్త సూపర్ స్టార్ అభిమానులకు కిక్ ఇస్తోంది. ఇటీవల మహేష్ హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలు తమిళ నాట కూడా భారీగా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల తమిళ వర్షన్ లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ తో మహేష్ పాత్రకు డబ్బింగ్ చెప్పించారు.
కానీ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు మాత్రం తమిళ వర్షన్ కు కూడా మహేష్ స్వయంగా డబ్బింగ్ చెప్పాలని భావిస్తున్నాడట. చెన్నైలోనే పుట్టి పెరిగిన ప్రిన్స్ తమిళంలో బాగా మాట్లాడగలడు. అందుకే మహేష్ సొంత గొంతుతో డబ్బింగ్ చెపితే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







