స్కైడైవింగ్ చేస్తూ పారాచూట్ తెరుచుకోక మృతిచెందిన మహిళ
- September 11, 2016
విమానంలో నుంచి స్కై డైవింగ్ చేసిన సమయంలో పారాచూట్ తెరుచుకోకపోవడంతో ఓ మహిళ (49) దుర్మరణం చెందింది. శనివారం ఉత్తర ఇంగ్లండ్ లోని కౌంటీ డుర్హంలో ఆ దుర్ఘటన చోటుచేసుకుంది. హెబ్బర్న్ కు చెందిన ఈ మహిళను సమీప ఆస్పత్రి తరలించగా, అక్కడ మరణించినట్టు అధికారులు చెప్పారు.
సదరు మహిళ గతంలో విదేశాల్లో పారాచూట్ జంప్స్ చేసిందని, ఇంగ్లండ్ లో మాత్రం స్కై డైవ్ చేయడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. స్కై డైవ్ చేయడానికి సొంతంగా పారాచూట్ ను సమకూర్చుకుందని చెప్పారు. పారాచూట్ ఓపెన్ కాకపోవడానికి గల కారణాలను బ్రిటీష్ పారాచూటింగ్ అసోసియేషన్ తెలుసుకుంటుందని తెలిపారు. గత నెలలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇలాంటి ఘటనల్లోనే పారాచూట్లు తెరుచుకోకపోవడంతో ఇద్దరు స్కైడైవర్లు చనిపోయారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







