హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆటా మరియు ప్రవాసి మిత్ర మాగజైన్
- September 11, 2016
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మరియూ ప్రవాసి మిత్ర మాగజైన్, అవినాష్ మ్యారేజ్ బ్యూరో, యొయొ టివి సమ్యుక్తంగా అక్టోబర్ 2న, హైదరబాదులో ప్రవాసి బతుకమ్మ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధరంగాల్లో ప్రతిభ కనబరిచన 10 మంది ప్రవాస భారతీయ, భారత సంతతి మహిళలను ప్రవాస స్త్రీ శక్తి అవార్డుతో సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ, సొమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో జెనరెల్ అసెంబ్లీ ఐపిపిఎఫ్ పద్మజా రెడ్డి,నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ హైదరాబాద్ కి చెందిన నిశీ జోసెఫ్, జర్నలిస్టులు సరస్వతీ రమ, కట్టె కవిత, సింగర్ శివప్రియ, కోఅర్డినేటర్ ముళ్ళపూడి వెంకట అమ్రీ, ప్రవాసి బతుకమ్మ ఈవెంట్ జివి కోటి రెడ్డి, అవినాష్ మ్యారెజ్ బ్యూరోకి చెందిన అవినాష్ రెడ్డి,సౌది అరేబియాకి చెందిన ఎన్నారై మహమ్మద్ ముబీన్, కల్చరల్ కో ఆర్డినేటర్ రాఘవేంద్ర, సింగర్ స్వరూపా రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా వీరంతా మాట్లాడుతూ "స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువుంటారు అన్న నానుడి ఉంది. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న భారత సంతతి మహిళలికి ప్రవాసీ స్త్రీ అవార్డు ఇవ్వడం అన్నది" అభినందించతగ్గ విషయమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







