తప్పిపోయిన ఇండియన్ కుక్ మృతి
- September 11, 2016
దుబాయ్: ఇటీవలే ఇండియా నుంచి దుబాయ్‌కి వచ్చిన కుక్ మైకేల్, అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 36 ఏళ్ళ మైకేల్, కేరళ నుంచి సెప్టెంబర్ 3న విజిట్ వీసాపై దుబాయ్‌కి వచ్చాడు. సెప్టెంబర్ 6న అతను తప్పిపోయినట్లు మృతుడి బంధువు సిజో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిజో పనిచేస్తున్న అల్ కోజ్ మాల్‌లోని ఓ క్యాటరింగ్ కంపెనీలో కుక్‌గా పనిచేస్తున్నాడు మైకేల్. అయితే రాత్రి డ్యూటీ ముగిసిన తర్వాత, అకామడేషన్‌కి వెళ్ళే క్రమంలో కంపెనీ వ్యాన్‌ని మిస్ అయిన మైకేల్, కాలి నడకన వెళ్ళడంతో, దారి తెలియక తప్పిపోయాడు. పాస్‌పోర్ట్, వీసా తను పనిచేస్తున్న చోట మర్చిపోయాడని సిజో పోలీసులకు తెలిపాడు. మార్చురీలో మైకేల్ మృతదేహం ఉందని, పోలీసులు విచారణ తర్వాతే మైకేల్ మృతి వివరాలు వెల్లడిస్తామన్నారనీ, ఈద్ అల్ అదా సెలవుల అనంతరం ఫోరెన్సిక్ నివేదిక వస్తుందని పోలీసులు తెలిపినట్లు చెప్పాడు సిజో.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







