వొడాఫోన్, ప్రభుత్వ రంగంలోని బిఎస్ఎన్ఎల్ ఒప్పందం ..
- September 11, 2016
దేశవ్యాప్తంగా 2జి ఇంట్రాసర్కిల్ రోమింగ్ సేవలను అందించేందుకు ప్రైవేట్ రంగంలోని వొడాఫోన్, ప్రభుత్వ రంగంలోని బిఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. వినియోగదారులకు అత్యుత్తమ టెలికాం సేవలందించే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. ఈ ఒప్పందంతో గ్రామీణ ప్రాంతాల్లో వొడాఫోన్‌కు 2 జి నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే అవకాశం లభించనుండగా పట్టణ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను పటిష్ఠం చేసే అవకాశం లభించనుంది. దేశవ్యాప్తంగా వొడాఫోన్‌కు 1.37 లక్షల టవర్లుండగా బిఎస్ఎన్ఎల్కు 1.14 లక్షల టవర్లున్నాయి. ఒప్పందం కారణంగా కోట్లాది మంది కస్టమర్లు వాయిస్, డేటా వినియోగం కోసం అద్భుతమైన నెట్‌వర్క్‌ను నిరంతరాయంగా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుందని వొడాఫోన్ ఎండి, సిఇఒ సునీల్ సూద్ తెలిపారు.
నెట్వర్క్ అప్‌గ్రేడేషన్ కోసం వొడాఫోన్ భారీగా పెట్టుబడులు పెట్టిందని గ్రామీణ ప్రాంతాలు, సుదూర ప్రాంతాల్లోని వినియోగదారులకు చేరువయ్యేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని అన్నారు. ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో మౌలిక సదుపాయాలను పంచుకోవటం ద్వారా దేశంలో నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే అవకాశం లభించిందని బిఎ్‌సఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ అన్నారు. వొడాఫోన్ భాగస్వామ్యంతో ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో అత్యుత్తమ నెట్వర్క్ కవరేజ్‌ను అందించనున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. వొడాఫోన్‌కు 19.90 కోట్ల మంది కస్టమర్లుండగా బిఎస్ఎన్ఎల్కు 8.95 కోట్ల మంది వినియోగదారులున్నారు.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







