మెట్రో రైల్ నెట్‌వర్క్ పట్ల ఆస్ట్రేలియా వాసుల్లో నెలకొన్న అసంతృప్తి..
- September 12, 2016
మెట్రో రైల్ నెట్‌వర్క్ పట్ల ఆస్ట్రేలియా వాసుల్లో నెలకొన్న అసంతృప్తి ఈ ఏడాది కూడా ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని సిటీ రైల్ నెట్‌వర్క్‌లో మెట్రో రైళ్లు అతి చెత్త నెట్‌వర్క్‌గా జనం తేల్చిచెప్పారు. ఇలా జనం మెట్రోపై తమ అభిప్రాయలను తేల్చిచెప్పడం వరుసగా ఇది ఐదోసారి. మెట్రో టికెటింగ్ సిస్టమ్ అతి పెద్ద సమస్యగా మారినట్టు జనం ఒక సర్వేలో కుండబద్ధలు కొట్టారు. సర్వీసుల విశ్వసనీయత, సాఫీగా సాగే జర్నీ, టికెటింగ్, టైమ్‌టేబుల్స్, స్టేషన్లు, రైళ్లలో శుభ్రత వంటి వాటిపై సంతృప్తికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. సిటీ నెట్‌వర్క్‌లో మెట్రో రైళ్ల సర్వీసు ఏమాత్రం అసంతృప్తిగా లేదని మెల్‌బోర్న్ ప్రయాణికులు పెదవి విరిచారు.ముఖ్యంగా టికెటింగ్ సిస్టమ్ బాగోలేదని, ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండటం, రైళ్లు, మెల్‌బోర్న్ స్టేషన్లలో తగినంత సెక్యూరిటీ లేకపోవడంపై సర్వేలో పాల్గొన్న వారి నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. 50 శాతానికి పైగా ప్రయాణికులు తరచు రైళ్లు ఆలస్యమవుతున్నాయని అభిప్రాయపడగా, రాత్రిళ్లలో మాత్రమే రైళ్లను అందుకోగలుగుతున్నట్టు 42 శాతం మంది ప్రయాణికులు తెలిపారు. మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్, అడిలైడ్, క్వీన్‌ల్యాండ్‌కు చెందిన 6000 మంది రైలు ప్రయాణికులను కన్స్యూమర్ రీసెర్చ్ ఫర్మ్ 'కాన్‌స్టార్ బ్లూ' సర్వే చేసింది. సర్వే ఫలితాల ప్రకారం వరుసగా ఐదోసారి మెట్రో చివరి ప్లేస్‌లో ఉంది.
శాటిస్‌ఫాక్షన్ రేటుగా మూడుస్టార్లు వచ్చాయి. ట్రాన్స్‌పెర్త్‌కు అత్యధికంగా 5 స్టార్‌ల రేటింగ్ రాగా, అడిలైడ్ మెట్రో, సిడ్నీ ట్రయిన్స్, క్వీన్స్‌ల్యాండ్ రైల్‌కు నాలుగు స్టార్‌లు వచ్చాయి. మెల్‌బోర్న్ ప్రయాణికులు మైట్రో సర్వీస్ పట్ల ఏమాత్రం తృప్తిగా లేరని, గత ఐదేళ్లుగా మెట్రో సర్వీసుల్లో మెరుగుదల ఏమాత్రం పెరగలేదని సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడినట్టు కాన్‌స్టర్ బ్లూ ఎడిటర్ సైమన్ డౌనెస్ తెలిపారు. తామకు అందుతున్న సర్వీస్ కంటే చెల్లిస్తున్న టిక్కెట్ రేటే ఎక్కువగా ఉంటోందని మెట్రో కస్టమర్లు స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారని, ముఖ్యంగా టిక్కెటింగ్ సిస్టమ్ పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







