'ఇంకొక్కడు' విజయోత్సవం

- September 12, 2016 , by Maagulf
'ఇంకొక్కడు' విజయోత్సవం

 ప్రతి సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకునికి పరిచయం చేస్తూ.. తమిళంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమకు సుపరిచితమైన కథానాయకుడు విక్రమ్‌. ఆయన హీరోగా ఇటీవల విడుదలైన 'ఇంకొక్కడు' చిత్రం విజయోత్సవ వేడుకను ఆదివారం పార్క్‌ హయత్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్రమ్‌తోపాటు చిత్ర బృందం హాజరై ప్రశంగించారు.
ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన 'ఇంకొక్కడు' చిత్రానికి హారిస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చారు. నయనతార, నిత్యా మెనన్‌ కథానాయికలుగా నటించారు. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com